Wednesday 17 July 2013

నువ్వెవ్వరో .. నేనెవరినో

నువ్వెవ్వరో .. నేనెవరినో 

అనుకోకుండా తారస పడ్డాము
మనిద్దరి మధ్య
గతంలో ఏదో తెలియని
బంధం పెనవేసుకుని
పోయినట్టు చూసినప్పుడే
అనిపించింది ...అలవాటుగా
ఆత్మీయత నిండిన నీ రూపం
ముగ్ధ మనోహరమైన
నీ వాలు చూపు
చంద్ర బింబమై నా నుదిటి మీద
నీ పెదవులు సంతకం చేసింది
ఇద్దరి మధ్య కలిగిన
ఆ ఆందోళనల భావ పరంపర
కోటి కాంతులను విరజిమ్మేలా చేసింది
నువ్వు నేనుగా మారే
సందర్భంలో హృదయాలు
మెల్లగా విచ్చుకుంటాయి
మనసులు మౌనంగా
విప్పారుతాయి .. ఆ సమయంలో
గాలి గుమ్మమై గడియ వేస్తుంది
ఏకాంతపు ఊహాల్లో
పెనవేసుకునేలా కాపలా కాస్తుంది
అప్పుడు చూపులు
కనురెప్పలై కవ్విస్తాయి
యెద మీద చిలిపిగా సిందూరపు
ముద్దును అద్దుతాయి
అప్పుడు కలిసే ప్రతి నిమిషం
మల్లెపూలను ఆహ్వానిస్తాయి
మనిద్దరిని ఒకే దారి వైపు
ఒకే ఆత్మగా ..ఒకే శరీరంగా
మార్చేస్తాయి .. ఆ దేవుడు
ఈ లోకంలో ప్రేమ బతికే ఉందని
చెప్పేందుకే ఈ మెత్తని పూలను
ఇచ్చాడేమో ... కదూ
మల్లెలు మనసును దోచేస్తాయి
కమ్మని కలలల్ను నేర్పుతాయి
పండు వెన్నెల్లో పరిమళాలను
వెదజల్లుతూ గుండెల్లో
గుబులు రేపుతాయి ..
మనసులు మమేకమై పోయే వేళ
మాటలకందని అనుభవం
కొండ గుర్తుగా మిగిలేలా చేస్తుంది
అది పది కాలాల పాటు
వెంటాడుతుంది ...

గుండెల్లో..............

గుండెల్లో తాళముంది 
గొంతుల్లో రాగముంది 

........కలుపుదామా ఇద్దరం ఒకటై.