Wednesday 13 June 2012

వేసవి సెలవులు - ఉరేళ్తున

                                                            వేసవి సెలవులు - ఉరేళ్తున





వెళ్ళి రా మిత్రమా క్షేమమై, లాభామై, వీడుకోలు.....
అంటున్న సొంత ఊరు.......

ఇదిగో మిత్రమా మళ్ళి క్షేమమై, లభామై......
వీడుకోలు....అంటున సొంతూరు........

పెరిగిపోతున దూరం తీరనున భారం.......!!

అవుతున........ గమ్యానికి చేరువ........!!

ఎపుడు పచని పైర్లతో స్వాగతం పలికే పొల్లాలు ఎండిపోయి బీటలు వారిన భూమితో ధర్శానమిచాయి.....

ఎలా ఉన్నానో చూడు నన్ను అంటూ విలపించెను పంట కాలువలు నీరులేక........

ఎపుదోచావమా అని అమ్మలా పలకరించే అరటి చెట్టు ,

ఏమిటమ ఇపుడేనా రావడం అంటూ ఘాటుగా పలకరించే చింత చెట్టు,

కలవరపడకు అంటున్న కల్పతరువు(తాడి చెట్టు),

సూర్యుని రంగులో తలుక్కుమని మెరిసి తింటావా నా కాయలు అడిగే ఈతకాయలు.........

దారి పొడుగునా ఆత్మీయుల పలకరింపులు......

అప్పుడప్పుడు బస్సు ఆగినపుడు నిలబడి నాకు కాపలా కాస్తున గాలి.........

బస్సు భయల్దేరినపుడు నన్ను చలగా తాకుతూ నిదురపుచే ఆ పిల్ల గాలులు

కాండటరు అరిస్తే ఉరోచేసిందని అంటూ ఉలికిపడి లేచిన మనసు..........

బస్సు దిగగానే ఏమ్మా భాగునవ అందరు భాగునార అని పెదవుల పై చిరునవ్వులు చిందిస్తూ క్షేమసమాచారం కనుకున్తున తాతయ్య ............

ధరి వెంట నడుస్తునపుడు ధర్శనమిచే పూరి పాకలు........ప్రహరిలా అల్లుకున పిచ్చి చెట్లు.......,, పెధమనుషులు.......

ఏంటి మనవరాలు ఏం చదువుతుంది అంటూ ఆరాలు తీసే ఊరివాలు...........

ఇంటికి చేరితే కాలు కడుక్కోమని మర్యాదలు చేస్తున అమ్మమ.................

ప్రేమగా పలకరిస్తూ చెమత్కారాలు విసురుతున ఇరుగు పొరుగు.........

అమ్మ , నాన్న, భాగున్నారా అమ్మ అంటూ ఊరి పెద్ద ముతైదువులా పలకరింపులు...........

అంభా అని అరుస్తూ నను పిలుస్తున నల్లని ఘీద్ధ, వాటివెంటే పరిగేతుకు వచ్చే లేగ దుదపిల్లలు...........

మే.......... మే..... అంటూ మేక గుంపులు వాటి మద్యలో గంతులేస్తూన ముద్దు ముద్దు మేక పిల్లలు...........

పల్లెటూరి స్వచమైన గాలి- - -........., చెరువు లో నీటి మీద నుండి నను చేరెను..........

అమ్మమతో కబుర్లలో మునిగిపోయి ఆకలి మరిచా .......

అమ్మమ వండిన కమ్మని చింత చిగురు పప్పు తో భోజనం చేసి షికరుకెలా.........

చూస్తున ప్రతి చెట్టు, పుట్టా, భావి , అన్ని న చిన్ననాటి వేసవి సెలవుల జ్ఞాపకాల్ని గుర్తుచేస్తునాయి............

చింత చెట్టు నుండి గడకరతో చింతకాయలు కోయడం, చింతచిగురు కోసేవాళ్ళం..........

చెరువు దగర కుర్చుని చల్లని గాలిలో ఆడిన ఆటలు.......

బోరింగ్ పంపు దగ్గర పది మంది పిల్లలతో కలిసి ఆడిన ఆటలు............

ఇంటి వెనుక పొలాలు, పొలాలు మీదగా ఎర్రగా మామిడి పండులాగ, గుండ్రంగా, పైకి సూర్యుడు వస్తుంటే ఎగిరెగిరి చూసేవాళ్ళం...........

పోదునే లేవగానే నాన్న తో కలిసి నడుచుకుంటూ చెరుకు పొలాలవెంట తిరగడం...........

చిన్ననాటి జ్ఞాపకాలన్నీ తలమ్పుకోచి సంతోషం తో కళ్ళు  చేమ్మగిలాయి................

No comments:

Post a Comment