Thursday 14 June 2012

నాన్న
ఆలోచిస్తుంటే కొత్తగా వుంది ?
కళ్ళ ముందు చూస్తున్న ఈ విచిత్ర లోకాన్ని
అమ్మ కడుపులో వున్నా మన రూపాన్ని తన ఊహల్లో
ఊహిస్తూ మన కోసం ఎదురుచూస్తున్న నాన్న
ఎంతమందికి గుర్తున్నారు ?
పలకటానికి పేదవులు కలవకపోయినా
నాన్న అన్న పిలుపుకోసం ఎదురుచూస్తున్న నాన్న
ఎంతమందికి గుర్తున్నారు ?
బుడి బుడి అడుగులతో నాన్న గుండే లపై నడచినా
ఆ చిన్న నాటి జ్ఞ్యపాకాల స్మృతులు
ఎంతమందికి గుర్తున్నాయి ?

తన కున్న సమస్యలన్నీ చేధించుకొనీ
కష్టల్లో...........!
నష్టల్లో ..............!
కన్నిలంటే తేలియకుండ పెంచిన నాన్న ఎంతమందికి గుర్తున్నారు ?
అడగ గానే అన్ని సమకురుస్తూ ........
తన సమస్యలతో సతమతపడుతూ మన ముందు చిరు నవ్వు
నవ్వుతు మనల్ని నవ్విస్తున్న నాన్నఎంతమందికి
నాన్నలా గుర్తున్నారు ?
నేనున్న అనే నమ్మకాన్నిచ్చే కేరప్ అడ్రస్ నాన్న?
నిన్ను గా నువ్వు మర్చిపోయి నేడు కొత్తగా ?
ప్రేమ ,ప్రియురాలు,విరహం,మనస్సు,కోరిక అంటు
నాన్న నే మరచిపోయావా ?
ఈ విచిత్ర లోకం లో పావులా మారిపోయావా?
మన కోసం తన జీవితం అంత కష్టపడి
మంచి బాట వేయాలను కున్న నాన్న నే మరచిపోయావా .......




తిరిగి
ఒక తీయ్యని పలకరింపు
మధురమైన మాటలు
కమ్మనైన వెచ్చని కౌగిలి
పెద్ద ఖర్చు కాదు..............
ఎం చేసిన ఇప్పుడే .............?
నీ కోసం కరిగిపోయిన నాన్న కు
ఆ జ్ఞ్యపాకాల స్మృతులను గుర్తుచేస్తూ .........
నాన్న జీవితపు పుస్తకం లో ప్రతి పేజి పై పూల వానా కురించాలి.



No comments:

Post a Comment