Tuesday 16 April 2013

నా ప్రపంచం

                                                                     నా ప్రపంచం

నాది అనేది ఏది లేని ఈ ప్రపంచం లో                      
నా అనే వాలని వదిలి నాకోసం వచ్చి
నన్నే ప్రపంచం అనుకుని నాకంటూ ప్రపంచాని సృష్టించిన  మీ ఇధరికి నా ప్రేమ అంకితం..!!

Wednesday 3 April 2013

నువ్వు లేక నేను లేను

నువ్వు లేక నేను లేను

 

 

 సాగర గర్బంలోని అలలా నా ఎద ఘోషిస్తుంది 

నీ దరి చేరాలని  నా మనస్సు పరితపిస్తుంది 
అను క్షణం ఏదోలా  నీతో మాట్లాడాలని 
నా అంతరంగం అన్వేషిస్తోంది 
సెలయేటి గలగల ల్లాంటి 
                         నీ నవ్వు చూడాలని 
నదిలోని నావకు చిక్కనిలా 
                           నా మది వాంచిస్తోంది
నీ చక్కని ఓ ధార్పు కావాలని 
నిషి దాటితే పగలు లా నిజమే ననిపిస్తుంది 
నువ్వు లేక నేను లేనని........................

Tuesday 2 April 2013

నా ఊహ



నా ఊహ



నా కళల వైశాల్యం విస్తరిస్తుంది
                                      ఎందుకంటే ?
నా రాత్రుల్ని ఆమె కలలతో నింపేస్తుంది
నా గమ్యం చేరువవుతుంది
                                   ఎందుకంటే ?
ఆమె ప్రతి అడుగు నా ఊహల వైపుగా నడిచొస్తుంది 

మొదటి చూపు

మొదటి చూపు




నిన్ను చుసిన క్షణం లో 
తడబడింది నా హృదయం
గతి తప్పింది నా మనస్సు 
పెదవి విప్పనంది ..............మాట చెప్పానంది 
మొదటి చూపులో 
గొప్పతనం నాకు తెలిసింది 
చివరి వరకు నీ తోడు కావలంది 
అనుక్షణం నీ జ్ఞ్యపకాలతో 
నీ సమాధానం కోసం ఎదురుచూస్తున్న.............

ప్రేమ & ద్వేషం

                                                                   

ప్రేమ & ద్వేషం

 

స్నేహం ప్రేమగా మారొచ్చు 

            కానీ          
ప్రేమ స్నేహంగా మాత్రం మరాదు
స్నేహం ప్రేమగా మరి బలపడుతుంది 
ప్రేమ ద్వేషం గా మారి దూరమవుతుంది

 

కవ్వించే ప్రియతమా!




కవ్వించే ప్రియతమా!


కలలో వచ్చి కవ్వించే ప్రియతమా!
నా జివితంకు అలవు కావుగా 
నీ జాడ నాకు తెలియక 
నీ ద్యాస లోనే బ్రతుకుతున్న 
కలగా మిగలకుండా నిజమై ఏదురురా ప్రియా........ 

కళ్యాణం...కమనియ్యం

 

కళ్యాణం...కమనియ్యం

 
 
 
నా ఊహలోక రాజకుమరుడవు
నా స్వప్న దేశ సౌరబోముడవు 
నా కలల దేశానికి యువరాజువు 
నా నిజ జీవిత బాగస్వామివి
ఈ అందాల అపరంజి నీ కోసం 
ఈ సుగుణాల సుకుమారి నీ సొంతం 
మూడు ముళ్ళ బంధం తో 
ఏడు అడుగుల పయనంతో సాగిపోవాలి జీవితం కలకాలం 
మీ కళ్యాణం కావాలి కమనియ్యం  

కవిత


కవిత




మనసులో ని భావాల రూపామేగా కవిత ........
కలల లోని కమనీయ కావ్యమేగా కవిత..........
కన్నిటికి సమాధానం కవిత........
మది  లోని  భావాలూ అన్నికలసి మనసులో వేదన  తో 
కలం తో కాగితం పైన రాసే అక్షరాల రూపం  కవిత......
కమనీయ మైన అమ్మ పాట కవిత ..........
కలుసుకోలేని రెండు మనస్సుల వ్యధ కవిత .........
అదం మీద నీటి ముత్యపు చినుకు కవిత......

ఓ ప్రియా

ఓ ప్రియా


ఓ ప్రియా
నీ జీవితం లో ఎప్పటికి చెదరిపోని గతాన్ని నేను 
ఎప్పటికి మాసిపోని నిజాన్ని నేను
గతం కనుమరుగై పోతున్న వేళ
కలగా కరిగిపోకుండా ఎదురై దరిచేర వెందుకు?
కరిగిపోయిన కమ్మని కలని జ్ఞ్యపకం చేస్తావెందుకు?
కళ్ళ వెనుక దాగిన స్వప్న్నని కళ్ళ ముందుకు తెస్తా వెందుకు?
నన్ను అగాధంలో కి నేట్టేసావెందుకు?
నా ప్రతి అణువున నిన్ను వెతికి వెతికి అలసిపోయాను
కనిపించని ఎండమావిలా...........
శిశిరంలో రాలిన ఆకులా............
హిమ శిఖరం నుండి జాలువారిన మంచుముత్యం లా 
పగిలి పోయిన గాజు బొమ్మలా మార్చవెందుకు?
నా కళ్ళ ముందు చెదిరిన స్వప్నాల సాగరాన్ని చేరమంటావు 
ఒక్కో ఆత్మీయపు పలుకరింపుని జోడిస్తావు 
నీ జ్ఞ్యపకాల గాయాలను గేయలుగా మార్చుకొని 
కమ్మని కవితకు అలంకరాలుగా మారవుగా చివరికి ప్రియా 

నాన్న

నాన్న

ఆలోచిస్తుంటే  కొత్తగా వుంది ?
కళ్ళ ముందు చూస్తున్న ఈ విచిత్ర లోకాన్ని
అమ్మ కడుపులో వున్నా మన రూపాన్ని తన ఊహల్లో 
ఊహిస్తూ మన కోసం ఎదురుచూస్తున్న నాన్న 
ఎంతమందికి గుర్తున్నారు ?
పలకటానికి  పేదవులు  కలవకపోయినా 
నాన్న అన్న పిలుపుకోసం ఎదురుచూస్తున్న నాన్న 
ఎంతమందికి గుర్తున్నారు ?
బుడి బుడి అడుగులతో నాన్న గుండే లపై నడచినా 
ఆ చిన్న నాటి  జ్ఞ్యపాకాల స్మృతులు   
ఎంతమందికి గుర్తున్నాయి ?
తన కున్న సమస్యలన్నీ చేధించుకొనీ 
కష్టల్లో...........!
నష్టల్లో ..............!
కన్నిలంటే తేలియకుండ పెంచిన నాన్న ఎంతమందికి గుర్తున్నారు ? 
అడగ గానే అన్ని సమకురుస్తూ  ........
తన సమస్యలతో సతమతపడుతూ మన ముందు చిరు నవ్వు 
నవ్వుతు మనల్ని నవ్విస్తున్న నాన్నఎంతమందికి 
నాన్నలా గుర్తున్నారు ?
నేనున్న  అనే నమ్మకాన్నిచ్చే కేరప్ అడ్రస్ నాన్న?
నిన్ను గా నువ్వు మర్చిపోయి నేడు కొత్తగా ?
ప్రేమ ,ప్రియురాలు,విరహం,మనస్సు,కోరిక అంటు 
నాన్న నే మరచిపోయావా ?
ఈ విచిత్ర లోకం లో పావులా మారిపోయావా? 
మన కోసం తన జీవితం అంత కష్టపడి 
మంచి బాట వేయాలను కున్న నాన్న నే మరచిపోయావా .......


తిరిగి 
ఒక తీయ్యని  పలకరింపు
మధురమైన మాటలు 
కమ్మనైన వెచ్చని  కౌగిలి 
పెద్ద ఖర్చు కాదు..............
ఎం చేసిన ఇప్పుడే  .............?
నీ కోసం కరిగిపోయిన నాన్న కు 
               ఆ జ్ఞ్యపాకాల స్మృతులను గుర్తుచేస్తూ .........
నాన్న జీవితపు పుస్తకం లో ప్రతి పేజి పై పూల వానా కురిపించాలి

ఏదీ నీ గమనం

ఏదీ నీ గమనం

ఏదీ  నీ గమనం ...................
ఎక్కడ నీ గమ్యం................
పయనించే దరులేన్నైనా 
ప్రయత్నపు జాడలు మరువకు 
విశ్రమించ కుండ శ్రమించు  గమ్యం చేరే వరకు 
గమ్యం ఎంత చిన్నదైన కావచ్చు 
                 కానీ 
గతి లేని గమనానివి కాకు .............
గడచినా కాలాన్ని మరవకు...,

నా గుండె గోష?

నా గుండె గోష?

రగులుతున్న నా గుండె గోష
వినేవారే లేక ? ఏం చెయ్యాలో తెలియక ?
స్వార్ధం అనే గాజు భవంతిలో బందీగా ఉండిపోయా 
రోజుకోసారి రగిలే ప్రళయగ్నులు 
                               నిలువెల్ల దహిస్తుంటే ......
మరణానికి ఒక్క క్షణం సాహసం చేస్తే 
రాటుదేలిన గుండె కూడా ఆగిపోతుంది 
                             తీసుకొనే శ్వాస కూడా నిలిచిపోతుంది!
ఈ గుండె సెగను ఓదార్చే వారు లేరు
ఎద సెగను మరలించే వారు లేరు
ఎప్పుడు ,ఏలా మొదలైందో ఈ ఎద గొడవ?
ఇప్పటికీ నీ కోసం కంట కన్నీరు నింపుకొని వేచాను సఖియా....

చెలి


                   

చెలి



ఈ జీవన పద్మవుహం లో 
దారులన్నీ మూసుకుపోయిన వేళ నా ఆశా దివ్వె నువ్వేగా 
అలసిన నా మనస్సును సాంతన పరచే చిరు స్నేహానివి  నువ్వు
ఆశయ సాధన మధనం లో అమృతం నువ్వు 
అలుపెరగని పయనాన నా గమ్యం నువ్వు 
నిషి విధిలో నీలాకాశం లో అందని తరవే నువ్వు
ఆనంద డోలికల్లో అల్లరివే నువ్వు
నా ఒంటరి తలపుల్లో అందమైన ప్రతిబింబనివే నువ్వు
అరుణోదయం వేళ ఉష కిరణంలా పలకరిస్తావు 
సంధ్య వేళ చల్ల గాలిలా నా వెంట వుండి నిద్రపుచుతావు 
నిన్ను మరువగాలనా చెలి మాటవరుసకైన .................
ప్రతి గడియలో నా తోడుండి నడిపించవా  చెలి.................

మన తొలి రాత్రి ప్రియా?

                                                                                                                                                                               
                                                                                                                                                                             

        మన తొలి రాత్రి ప్రియా?


నీవు తొలకరి వర్షపు జల్లువా 
నా సరసన విరిసిన మల్లేవా 
నా యదలో వసంతాల వెల్లువా చెలి 
నాడు నింగి ఒక సంపంగి రేకు 
నేల ఒక పూబంతి సోకు 
నడుమ నడిచే నీవు అందమైన తామరాకు 
గదిలోని సగం కాలిన అగరువత్తుల కొనలు అలిగి ఆవిరవుతుంటే 
నీ సొగసంతా ఆవిరై నీటి బిందువులా నన్ను తాకుతుంటే 
ఒక్కసారి ప్రపంచమంతా నిశద్ధమై .........................
                                 నీ శ్వాసే వినిపిస్తుంటే ................
ఆ క్షణం లో ఆ దివి తరలిరాధ ఈ  బువికి 
నలిగిన నాలుగు గోడల మధ్య 
                                  నలు దిక్కులు చూపుతు ?
బంగారు వర్ణం తో మెరిసిన ఉదయపు వాకిలి అప్పుడే 
                                    ఆవ్వానించిందా  ప్రియా...............


కలలా కరిగిపోయవా ప్రియా?

                                                                 

కలలా కరిగిపోయవా ప్రియా?



కటిక చీకట్లు కమ్ముకున్న నిషిరాత్రి లో 
తెలియని దారులు వెతికి కనుపాప అలసిపోతే 
కడలి ఒడిలో కలవరపడి నిద్ర పోయాను 
కలై వస్తావని కనులు ముయనా ?
కరిగిపోని కలగా .................మిగిలిపోతున్న.
................................నీ కధలా 
ఆగలేను ఆత్రంగా ........................
ఎదురు నిలిచావని కనులు తెరచాను ?
కలలా కరిగిపోయవా ప్రియా?
                       ఎదురై దరి చేరవా .............
నా యదలో వసంతాలను నింపవా ................

నాదో తీరని కోరిక


                                       నాదో తీరని కోరిక




తీరిక లేని  లోకంలో నాదో తీరని కోరిక 
క్షణాల ప్రయాణం లో నాదో తీరని కోరిక 
అంతు తెలియని అన్వేషణ లో నాదో తీరని కోరిక 
గమ్యం తెలియని ప్రయాణం లో నాదో తీరని కోరిక 
నాదో తీరని కోరిక ...................................
కోరికల సమూహం లో నాదో తీరని కోరిక 
ఆకాశాన్ని చేరుకోవాలని 
ఆ చుక్కలన్నీ నా కొప్పులో ఒదిగిపోవాలని 
ఆ చందమామే నా బుగ్గపై దిష్టి చుక్క కావాలని 
ఆ సూర్యుడే నా గది లో దీపమై వుండాలని 
ఆ పున్నమి వెన్నెల నా వెంట నడచి రావాలని 
నాదో తీరని కోరిక ..............................
నా కోరిక తీరే రోజే రావాలని నాదో తీరని కోరిక?