Tuesday 2 April 2013

ఓ ప్రియా

ఓ ప్రియా


ఓ ప్రియా
నీ జీవితం లో ఎప్పటికి చెదరిపోని గతాన్ని నేను 
ఎప్పటికి మాసిపోని నిజాన్ని నేను
గతం కనుమరుగై పోతున్న వేళ
కలగా కరిగిపోకుండా ఎదురై దరిచేర వెందుకు?
కరిగిపోయిన కమ్మని కలని జ్ఞ్యపకం చేస్తావెందుకు?
కళ్ళ వెనుక దాగిన స్వప్న్నని కళ్ళ ముందుకు తెస్తా వెందుకు?
నన్ను అగాధంలో కి నేట్టేసావెందుకు?
నా ప్రతి అణువున నిన్ను వెతికి వెతికి అలసిపోయాను
కనిపించని ఎండమావిలా...........
శిశిరంలో రాలిన ఆకులా............
హిమ శిఖరం నుండి జాలువారిన మంచుముత్యం లా 
పగిలి పోయిన గాజు బొమ్మలా మార్చవెందుకు?
నా కళ్ళ ముందు చెదిరిన స్వప్నాల సాగరాన్ని చేరమంటావు 
ఒక్కో ఆత్మీయపు పలుకరింపుని జోడిస్తావు 
నీ జ్ఞ్యపకాల గాయాలను గేయలుగా మార్చుకొని 
కమ్మని కవితకు అలంకరాలుగా మారవుగా చివరికి ప్రియా 

No comments:

Post a Comment