Sunday 12 May 2013

అమ్మత(ధ)నం

అమ్మత(ధ)నం
అమ్మ- అంటే 'అ'న్నిట 'మ'మేకమై' మ'నుగడ నిచ్చేది సమస్త సపర్యలు సలిపి సాకేది –అమ్మ 


సహనం, త్యాగం, ప్రేమ, కరుణ,
దయ, దండన, గాబరా, గారాబం

నానార్థాల, పరమార్థం--అమ్మ
పర్యాయ, పదాల ప్రతి పదార్థం--అమ్మ

సహన గుణంలో భూ మాత
త్యాగ ధనంలో భూ జాత

అమ్మ ప్రేమ ఒడి
ప్రాణి కి తొలి బడి

మమతాను రాగాలు పలికించే --జరి
కరుణ రసం కురిపించే –ఝరి

జగన్మాత స్యరూపం
కన్న తల్లి రూపం

పరమేశుని ప్రతినిది
ప్రతి ఇంట వెలసినది

దిశను చూపే దిక్కుసూచి--అమ్మ
దిక్కై నిలిచే సవ్యసాచి---అమ్మ

ప్రకృతిలో ప్రాణి కోటికి ప్రాణ దాత--అమ్మ
పృద్విపై ప్రతి సృష్ఠి చేయు విదాత--అమ్మ

జంతు జాలంలోను,
పక్షాదులలోను,
అవనిలోన అమ్మతనం
నిండైన కమ్మదనం

సుమాల సున్నితత్వం--అమ్మ
సుమనస్సు కోమలత్వం--అమ్మ

గంగా జలంలోని స్వచ్చందనం -- అమ్మ వాస్తల్యం
పాలలోని తెల్లందనం --అమ్మ మనస్సు
తొలి పొద్దులోని వెచ్చందనం--అమ్మ స్పర్శ
తేనెలోని తియ్యందనం--అమ్మ పిలుపు
వెన్నెలలోని చల్లందనం--అమ్మచూపు
అమృతంలోని అమరత్వం--అమ్మ దీవేన
జనని జన్మే జగతికి మూల ధనం

ప్రాణాన్ని పనంగా పెట్టి, పతి ప్రతిరూపాన్ని
పృద్వి పైకి పట్టుకొచ్చే పరమపావని--అమ్మ

తాటకు మంట వంటిది- అమ్మ కోపం
తామరపూల దండ వంటిది- అమ్మ దండన

పిల్లలా గాబరాపడినా,
తల్లిలా గారాబం పెట్టినా
ప్రేమించినా, కోపించినా,
దండించిన,దగ్గరకు తీసినా

పిల్లల క్షేమమే తన క్షేమమని తలిచే మాత
ఇలలో ఇంటింట వెలసిన ప్రత్యక్ష దేవత

ఆదరించి అక్కున చేర్చుకుంటుంది
అభయమిచ్చి అండగా నిలుస్తుంది--అమ్మ

ఊయల పాటగా లాలిస్తుంది
కంటికి రెప్పలా కావలి కాస్తుంది---అమ్మ

బిడ్డ కంటిలో నలుసు పడితే
తన కన్నులో కన్నీరొలికిస్తుంది---అమ్మ

బిడ్డ కడుపు నిండితే
తన ఆకలి తీరునని ఆశిస్తుది--అమ్మ

బిడ్డ ఎదుగుదల చూసి
మనసులో ఉప్పొంగి పోతుంది--అమ్మ్మ

బిడ్డ నడ(త)క లో తడబడితే
తల్లడిల్లి కృంగి పోతుంది --అమ్మ

అమ్మ గురించి, అనంతమైన ఆకాశం గురించి
చెప్పాలంటే భాష చాలదు, ఆశ తీరదు.

ఐనా ఈ చిరు ప్రయత్న మేదో చేశాను
నాకు తోచిందేదో వ్రాసాను
అమ్మలందరికి అభివందనం

Saturday 11 May 2013

Wedding Events

సప్తపది ఏడడుగుల బంధం

                               సప్తపది ఏడడుగుల బంధం

           

                               మేము           ఒకరికి ఒకరై తోడు నీడై 

                                                      సంతోషాల ముఖద్వారం లో వేసే 

                                                      మురిపాల ముద్దు  ముచ్చట్ల మొదటి అడుగు

 

             హృదయ అంతరంగాలలో

             ప్రేమ భావ తరంగాలతో వేసే
             నింగికెగసే రంగవల్లికల రెండో అడుగు 

                                               

           పెద్దల పట్ల వినయ విదేయాతల్నిచూపిస్తూ
           సత్సంప్రధాయల సంరక్షణ కోసం వేసే
                                                   ముచ్చటైన మూడో అడుగు

 

                                                    వేద ధర్మానికి వన్నెలు దిద్దుతూ

                                                    భారతీయ సంసృతికి నిలువేతు సాక్ష్యం గా వేసే 

                                                    నాణ్యమైన నాలుగోవ అడుగు

 

                                                   ఉభయ కుటుంభాల ఔన్నత్యాని
                                                  దశదిశలా వ్యాపింపజేస్తూ  వేసే
                                                  అభిజాత్యానికి ఆలవాలమైన ఐదోవ అడుగు

                                                      

                                                  గృహస్తాశ్రమ స్వీకారానికి
                                                 శ్రీకారం చుడుతూ వేసే
                                                 ఆనందదాయకమైన ఆరోవ అడుగు

 

                                                అనంత ప్రేమ వాహినిలో విహరిస్తూ
                                                జీవన వసంతాన్ని స్వాగతిస్తూ వేసే
                                                సత్యశివ సుందరమైన సప్తపది

Friday 3 May 2013

**నానీడనన్నొదిలివెళ్ళింది**

                                     **నానీడనన్నొదిలివెళ్ళింది** 
"సిగ్గు లేదూ ?!! ఎప్పుడు చూడు? జ్ఞాపకాల నీడల్లో తచ్చాడతావు నన్నొదిలి " అంది నా నీడ!
మరి? పోనీ నువ్విస్తావా ఊపిరి? అన్నాను నవ్వుతూ..

"చుట్టూ ఉన్న మనుషుల్ని, మమతల్ని వదిలి
ఎప్పటివో జ్ఞాపకాలతో గడుపుతావేంటి?
ఉండు!! మింగేస్తాను వాటిని " అంది నీడ!

ఇదుగో! నా జ్ఞాపకాల జోలికి పోకు!
వద్దక పోతే నన్నొదిలి వెళ్ళిపో ! అన్నాను.

నీకు తెలుసో లేదో?
నేను లేకపోతే నువ్వుండవు అంది.

అసలు నీ అస్తిత్వానికి కారణమే నేను అన్నాను.

కసిగా చూసింది...
కొంటెగా నవ్వేను!!!

సీన్ కట్ చేస్తే......

నలుగురు మోసుకెళ్తు న్నారు నన్ను .. కాటికి!!
నాతో పాటూ ఊక్కుంటూ వస్తోంది నీడ!
కాలే వరకూ ఉండి,
కాష్టాన్ని చూసి,
పకపకా నవ్వుతూ
నన్నొదిలి వెళ్ళింది నా నీడ!

పిచ్చిమొహం!
దానికి తెలీనిది ఒకటుంది .
తమ నీడతో వివాదిస్తున్న మరొకరికి
నేను జ్ఞాపకాల ఊపిరినయ్యేనని !!


***మీ................ జ్యోతి****

Thursday 2 May 2013

ఏమో ఎక్కడుందో.........

ఏమో ఎక్కడుందో కూసే కోయిలా
నాతో ఏమిట్టందో ఊహించేధేల....
ఎదో ఊయల ఊగే కోరిక...
ఎదో మాయలా అలే సరిగమ....

ఉండిపో.....

నువ్వు ఎదురుగా ఉంటే కాలం తెలియదు గా
నిన్ను చూడకపోతే ప్రాణం నిలువదు గా
గుండెకు ఊపిరి లా
మరు జన్మకు ఆయువు లా ఉండిపో..

ఎదురుకొగలవా.......

కలలో మొదటి పరిచయం గురుతు ఉందా
సరేలే చెలిమి పరిమళం చేరుగుతుందా
చేలివైన జంట నువ్వా
కలలోనే నీ కొలువా
చెలిమైన వెన్నెలవా
నిజమైన నా కలవా
నిను వీడగా కొనగోట మీటితే ఎదురుకొగలవా

నా ప్రియుడి చిరు నవ్వు............

చుక్కలనడిగా ఆ... మెరుపు ఎక్కడిదని
చంద్రుడిని అడిగా ఆ.... చూపుకు అర్ధమేమిటని
వెన్నెల ని అడిగా తన చలువ ఎక్కడిదని
మబ్బుల ని అడిగా తన పయనం ఎక్కడికని
అవి చూపించాయి నా ప్రియుడి చిరు నవ్వుని

మరు జన్మ ఎత్తి......

ఏ కులమని... ఏ మతమని....అడిగాను మబ్బులని
ఏ ఊరని....... ఏ దారని........ అడిగాను మెరుపులని
ఏ రంగని....... ఏ రూపని.......అడిగాను ఉరుములని
ఏ జాతని....... ఏ నీతని........ అడిగాను వర్షాని
తమలో తమకేమి భేదం లేదని చెపాయి.........
 చినుకులుగా నేల రాలి చివురులు గా మరు జన్మ ఎత్తి
చెలిమికి చిరునామా తమ కలయికేనని చేపకనే చెపాయి విరబూసిన వసంతంలా మారి 

వీడి పోలేను నిన్ను............

కలత చెందితే ఒక్క నిమిషం కరిగే కనీరై మరు నిమిషం
మొహమోస్తే ఒక్క నిమిషం మరిగే ముదై మరు నిమిషం
తాపమోస్తే ఒక్క నిమిషం తడిసే వలపు వానలో మరు నిమిషం
కలగా కలిశాను ఒక్క నిమిషం
నిజమై నిలుస్తాను ప్రతి నిమిషం
నీలో సగమైన నేను వీడి పోలేను నిన్ను ఎ... నిమిషం

వసంతానికి చిహ్నాలు.........

పువ్వులో సుగంధం
కూరి విప్పిన నెమల ఆనందం
కదేవి చిహ్నాలు వసంతానికి

నీ రాకను గుర్తించడానికి......

వేల పదములేల ఒక్క  మాటను చెపడానికి....
కోటి స్వరములేల ఒక్క రాగాని పలికించడానికి....
చిన్న చిరు నవ్వు చాలదా నీ రాకను గుర్తించడానికి......

Wednesday 1 May 2013

నేనేమి చేశాను పాపం........

మేఘాలతో స్నేహం...,,
కనీటితో కాపురం...,,
చేశాను నేను కొధి కాలం...,,

మౌనం తో గానం....,,
సంగీతం తో సహజీవనం..,,
చేశాను నేను కొధి కాలం...,,

తెలి మంచుకు...,,
తెర చాటు కన్యకు అయ్యా దూరం దూరం.....,,
మదిన కూడా తలచినా నేరం నేరం....,,
నేనేమి చేశాను పాపం పాపం.....,,

కవినై మిగిలాను ఆజన్మాంతం....,,,,,

చుట్టూ నిశి....

చుట్టూ నిశి నన్ను కముతుంటే...
నా నీడ నన్ను వీడి పోతే...
నీ దారి వేరంటూ గమ్యం పిలుస్తుంటే...
కన్నీరు తప కాలం కనపడదు....

నా గుండె ఝాలుమంది...

పావడ కాస్త పైకి లేపి నువ్వు కోవెల వాకిలి దాటుతుంటే... నీ కాలి గొలుసు లో వేలాడే ఒక మువ్వ ఘలుమంది...
వర్షం లో నిలువెల తడుస్తూ విదిలించిన వాల్జడలో జారి.... ఆ.. చిరు చినుకులు నా చెంపల పై పడి వోలు ఝాలుమంది.....
వోలంత నువ్వు కళ్ళు చేసుకుని చూస్తున్నది నా తడిసిన వోళ్ళని...... తెలిసిన క్షణమే ననే అల్లుతూ సిగ్గు అలుకుంది..
ఎగురుతూ నువ్వు పండాన్దుకోనుటలో ఎగసి పడే నీ సొగసులని... తొంగి తొంగి నేను చూస్తుంటే చెంప చెల్లుమంది...

నా గుండె ఝాలుమంది...

మనిషి తన మరణం కోసం..........

మనిషి తన మరణం కోసం ఎదురు చూసే పరిస్థితి ఎపుడు వస్తుందంటే............
తనకంటూ ప్రపంచం లో ఎవరు లేనపుడు..
చుట్టూ ఎంతమంది ఉన్నా ఈ ప్రపంచం లో తానోకదే ఉన్నటు అనిపించినప్పుడు..

మనసే ఎదురు...........

మనసే ఎదురు తిరిగి మాట వినదే
కలిసే ఆస కలిగి కునుకు పడదే
మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు
తుదిలేని ఊహలకు నీ స్నేహమే అదుపు
ప్రణాయానికే మన జంట నేర్పదా కొత్త మైమరపు