Sunday 12 May 2013

అమ్మత(ధ)నం

అమ్మత(ధ)నం
అమ్మ- అంటే 'అ'న్నిట 'మ'మేకమై' మ'నుగడ నిచ్చేది సమస్త సపర్యలు సలిపి సాకేది –అమ్మ 


సహనం, త్యాగం, ప్రేమ, కరుణ,
దయ, దండన, గాబరా, గారాబం

నానార్థాల, పరమార్థం--అమ్మ
పర్యాయ, పదాల ప్రతి పదార్థం--అమ్మ

సహన గుణంలో భూ మాత
త్యాగ ధనంలో భూ జాత

అమ్మ ప్రేమ ఒడి
ప్రాణి కి తొలి బడి

మమతాను రాగాలు పలికించే --జరి
కరుణ రసం కురిపించే –ఝరి

జగన్మాత స్యరూపం
కన్న తల్లి రూపం

పరమేశుని ప్రతినిది
ప్రతి ఇంట వెలసినది

దిశను చూపే దిక్కుసూచి--అమ్మ
దిక్కై నిలిచే సవ్యసాచి---అమ్మ

ప్రకృతిలో ప్రాణి కోటికి ప్రాణ దాత--అమ్మ
పృద్విపై ప్రతి సృష్ఠి చేయు విదాత--అమ్మ

జంతు జాలంలోను,
పక్షాదులలోను,
అవనిలోన అమ్మతనం
నిండైన కమ్మదనం

సుమాల సున్నితత్వం--అమ్మ
సుమనస్సు కోమలత్వం--అమ్మ

గంగా జలంలోని స్వచ్చందనం -- అమ్మ వాస్తల్యం
పాలలోని తెల్లందనం --అమ్మ మనస్సు
తొలి పొద్దులోని వెచ్చందనం--అమ్మ స్పర్శ
తేనెలోని తియ్యందనం--అమ్మ పిలుపు
వెన్నెలలోని చల్లందనం--అమ్మచూపు
అమృతంలోని అమరత్వం--అమ్మ దీవేన
జనని జన్మే జగతికి మూల ధనం

ప్రాణాన్ని పనంగా పెట్టి, పతి ప్రతిరూపాన్ని
పృద్వి పైకి పట్టుకొచ్చే పరమపావని--అమ్మ

తాటకు మంట వంటిది- అమ్మ కోపం
తామరపూల దండ వంటిది- అమ్మ దండన

పిల్లలా గాబరాపడినా,
తల్లిలా గారాబం పెట్టినా
ప్రేమించినా, కోపించినా,
దండించిన,దగ్గరకు తీసినా

పిల్లల క్షేమమే తన క్షేమమని తలిచే మాత
ఇలలో ఇంటింట వెలసిన ప్రత్యక్ష దేవత

ఆదరించి అక్కున చేర్చుకుంటుంది
అభయమిచ్చి అండగా నిలుస్తుంది--అమ్మ

ఊయల పాటగా లాలిస్తుంది
కంటికి రెప్పలా కావలి కాస్తుంది---అమ్మ

బిడ్డ కంటిలో నలుసు పడితే
తన కన్నులో కన్నీరొలికిస్తుంది---అమ్మ

బిడ్డ కడుపు నిండితే
తన ఆకలి తీరునని ఆశిస్తుది--అమ్మ

బిడ్డ ఎదుగుదల చూసి
మనసులో ఉప్పొంగి పోతుంది--అమ్మ్మ

బిడ్డ నడ(త)క లో తడబడితే
తల్లడిల్లి కృంగి పోతుంది --అమ్మ

అమ్మ గురించి, అనంతమైన ఆకాశం గురించి
చెప్పాలంటే భాష చాలదు, ఆశ తీరదు.

ఐనా ఈ చిరు ప్రయత్న మేదో చేశాను
నాకు తోచిందేదో వ్రాసాను
అమ్మలందరికి అభివందనం

No comments:

Post a Comment