సప్తపది ఏడడుగుల బంధం
సప్తపది ఏడడుగుల బంధం
మేము ఒకరికి ఒకరై తోడు నీడై
సంతోషాల ముఖద్వారం లో వేసే
మురిపాల ముద్దు ముచ్చట్ల మొదటి అడుగు
హృదయ అంతరంగాలలో
ప్రేమ భావ తరంగాలతో వేసే
నింగికెగసే రంగవల్లికల రెండో అడుగు
పెద్దల పట్ల వినయ విదేయాతల్నిచూపిస్తూ
సత్సంప్రధాయల సంరక్షణ కోసం వేసే
ముచ్చటైన మూడో అడుగు
వేద ధర్మానికి వన్నెలు దిద్దుతూ
భారతీయ సంసృతికి నిలువేతు సాక్ష్యం గా వేసే
నాణ్యమైన నాలుగోవ అడుగు
ఉభయ కుటుంభాల ఔన్నత్యాని
దశదిశలా వ్యాపింపజేస్తూ వేసే
అభిజాత్యానికి ఆలవాలమైన ఐదోవ అడుగు
గృహస్తాశ్రమ స్వీకారానికి
శ్రీకారం చుడుతూ వేసే
ఆనందదాయకమైన ఆరోవ అడుగు
అనంత ప్రేమ వాహినిలో విహరిస్తూ
జీవన వసంతాన్ని స్వాగతిస్తూ వేసే
సత్యశివ సుందరమైన సప్తపది
No comments:
Post a Comment