Monday 27 August 2012

అది నువ్వేనా

అది నువ్వేనా  

"నా యెదలో అడుగుల సవడి
నీదేనా 
 
నా శ్వాసలో పరుగులు తీస్తుంది
నీ నవ్వెనా

అర్ధం అవలేదే నాకు అది
నువ్వే అని 
ఆరాటమే నా మనసుకి నిను
చూడాలని............"

మరవలేను

మరవలేను

ఇంద్రదనసులోని రంగులను నీకోసం
తెసుకువచ..

ప్రతి రంగుపై నీ పేరుని రాసి ఆకాసంలో
నీకు చూపించ...

సప్త స్వరాల రాగాలని
మోసుకొచ....
ప్రతి రాగముతో  నీ పేరుని  పలికించి
నీకు వినిపించ..


అల చేసిన నిమిషం నీ
చిద్విలాసం.....
మరవలేను అ గ్యాపకం నా
జీవితాంతం....

నువ్వు నువ్వు

                                                 నువ్వు నువ్వు


పగిలిన గుండెలో నిండిన నీరాశకు ఆశవూ
నువ్వు ...............
మదీలో మేదీలిన ఆలోచనకు ఆయువు
నువ్వు ...........
మూగబోయెన నా మనసుకు తొలి పలుకువు
నువ్వు..............
నా కంటంలో తీయని స్వరం
నువ్వు ...............

నా అనుబూతి

                                                     నా అనుబూతి 

నీ కంటి చూపులోనే చిక్కుకునై నా
కళలు ........
నీ అరి చేతి స్పర్శలోనే ఇమిడిపోయే నా
చేక్కిలు......
నీ కంటి చూపులో చిక్కుకున్న నా కళల
తీయదనం.........
నా కలలో సైతం
చూడలేదు.......
నీ అరి చేతులో ఇమిడిపోయిన నా చెక్కిల
వెచ్చదనం.......
నా చేతి స్పర్శకు సైతం ఆ మైకం
తెలియదు.........

నీ వడిలో సాగిపోవాలి

నీ వడిలో సాగిపోవాలి  

చీకటి వెలుగుల స్వేచ
దానం,
పసి పాపా బోసి నావుల
దానం,

వెండి వేనల
వేచాదనం..
రోజా పువు
పరిమళం..

అని కలబోసినా అ
నిమిషం  ..


నీ వడిలో సాగిపోవాలి
అ సమయం....

నా మనసే ఎడారి

                                                      నా మనసే ఎడారి:


నా ఆశ ఎడారి అని తెలిసినా
నా కళలకు సంకెళ్ళు వేయలేకపోతున్నా
నా పయనానికి అర్థంలేదు అని తెలిసినా
నా నిరీక్షణ కొనసాగిస్తున్నా
నేను ఒంటరి అని తెలిసినా
అందులోనే సంతోషం నింపుకొంటున్నా ---------!

 

నీకు నాకు మద్య పంతమే దూరమా

నీకు నాకు మద్య పంతమే దూరమా: 
నీ బావమే నా స్వాసై జీవిస్తున్నా
నీ ఆలోచనలే నాకు గమ్యమైనదే
నీ ఊహలు నాలో లీనమైనదే
నీ మనసుకు నా మనసుకు మద్య దూరం
ఒక చిన్న నిశబ్దం అని తెలిసి భరించలేకపోతున్నా-------!

నా శ్వాసవే చెలీ నువ్వు

నా శ్వాసవే చెలీ నువ్వు :


నీ పరిచయం నా చిరునామా
నీ స్నేహం నా శ్వాస
నీ చిరునవ్వే నా గుండె చప్పుడు
నా అణువణువున నిండిన నీవు
ఎలా నన్ను విడిచి వెళ్ళిపోయావు
నువ్వు నాలో లేవని తెలిసి
నా నీడ నీలోనే ఐక్యం అయ్యింది చూడు .....

నా అంతం నువ్వు ........

నా అంతం నువ్వు ........

నా తనువుకు ప్రాణం నువ్వు ,

నా గుండెకు సవ్వడి నువ్వు ,

నా కనులకు అందం నువ్వు ,

నా కళలాడు ఆశవు నువ్వు ,

నా అడుగుల సవ్వడి నువ్వు ,

నా జీవితానికి అంతం నువ్వు...

తీరం లేదని తెలిసీ------?

                                         తీరం లేదని తెలిసీ------?
అడుగు వేసే ముందు నాకు ఆలోచన శక్తి లేదు
పయనం ఎక్కడికో తెలియకుండానే మొదలు పెట్టా
ఒంటరి అని తెలిసి ముందుకెల్లాలని  అడుగేసా!
కాని అడుగు వేసాకే  తెలిసింది తీరం లేదు అని....

నేను, నా సూర్యాస్తమయం

                                        నేను, నా సూర్యాస్తమయం


చూడడానికి ఎంత అందంగా ఉంది సూర్యాస్తమయం
చల్లటి నదిగాలికి , అలికిడిలేని తీరాన
ఒంటరిగా నేను వున్నా, కన్నీటి వలయం నాచుట్టూ వున్నా
అన్ని జ్ఞాపకాలని మరిచిపోతున్నా --------
 

నా జీవిత పయనం


నా జీవిత పయనం

ఎన్నో దారులు
ఎన్నో పరిచయాలు
ఎన్నో అనుభవాలు
ఎన్నో చేదు జ్ఞాపకాలు
ఎన్నో ఆశయాలు
ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఊహించలేని అనుబందాలు
కాని నా అడుగు ఎక్కడ ప్రారంభించానో ఎలా ముగుస్తుందో???

కరిగే నా కళ

                                                       కరిగే నా కళ


నా గుండెలోని కోరికకు రెక్కలొచ్చి
కన్నీళ్ళ రూపంలో నానుండి విడిపోతోంది
తీరని నా ఆశ ప్రతిక్షణం
ఈ కొవ్వోతి వెలుగులా తగ్గిపోతోంది.
నా మనసుకు ఎందుకు ఇంత శిక్ష కాలమా----------

నా మనసుకు నచ్చిన లోకం

                                     నా మనసుకు నచ్చిన లోకం


ప్రకృతిలో ఎన్నో అందాలున్నా,
వాటిని ఆస్వాదించే వారు చాలా అరుదు........!
అందులో పౌర్ణమి వెన్నెలలో,
హోరున వీచే గాలి నన్ను హత్తుకొని,
నా చెవిలో ఏదో ఊసులు చెబుతుంటే,
అలల చప్పుడు నాకు కొత్త రాగాలు నేర్పుతుంటే,
నాకు వాటితో జతకలపాలని వుంది.

love failure



నింగి  నుంచి  జాలువారిన  అ నీటి  చినుకు ,
ప్రకృతి కౌగలిలో  బంధించే  చిరుగాలి ,
లేలేత  చిగురాకు  చివరంచున  ఊగిసలాడే  నీటిబిందువు,
తెల్లవారు  జామున  తామరాకుపై  వుండే  మంచు  ముత్యం  మెరుపు,
ఇవ్వన్ని  ప్రకృతి  మనకిచ్చే అందాలైతే,
నాకు  నీ  ప్రేమే  అందం  ప్రియ ...............

నీ కోసమై ఎదురుచూపు

                                        నీ కోసమై ఎదురుచూపు

చిరు ఆశతో నా కళ్ళు ఇంకా నీకోసమే ఎదురు చూస్తోంది,
తిరిగిరావని తెలిసినా, ఇక నీవు లేవని తెలిసినా,
నీ రూపం గాలిగా మారి నా శ్వాసలో కలిసినా,
నా మనసు నీతో సమాది అయినా,
ఇంకా నా కళ్ళలో నువ్వు తిరిగి వస్తావని చిన్న ఆశ-----------!

నేనెవరో నాకే తెలియని స్థితి

                                                నేనెవరో నాకే తెలియని స్థితి 

నా గమ్యం మరిచాను,
నా ఆశ, కళ అన్నే నీవనుకున్నా.....
అందుకు నాకు మిగిలింది ఈ సముద్రమంత కన్నీరు!
ఈ అలల తాకిడి నన్ను తన కౌగిట్లోకి  పిలుస్తోంది.
నా మరణమే నాకు చేరువ కాబోతోంది.
కాని ఏదో భయం  నన్ను పిరికిదాన్ని చేస్తోంది.
బహుసా! మళ్లీ నువ్వు నాకోసం వస్తావనే ఆశే  ఏమో........ 

నా జీవితానికి అర్థంగా వుంటావా ప్రియతమా

నా జీవితానికి అర్థంగా వుంటావా ప్రియతమా

ఎలా నీ ఊహలకు నా మనసు బానిస అయ్యిందో చెప్పలేను,
కాని నా ప్రతి కదలికా నీకోసమే అని చెప్పగలను.

నిన్ను ఎలా జీవితాంతం చూసుకొంటానో  చెప్పలేను కాని,
అమ్మను సైతం నా ప్రేమతో మరిపించగలనని చెప్పగలను.

ఎలా నాలో ప్రేమ మొదలయ్యిందో చెప్పలేనుగాని,
నువ్వు లేకపోతే నా జీవితానికి అర్థం లేదని చెప్పగలను.

నది మద్యన నా కళ

                                                            నది మద్యన నా కళ 

నీ తలపులతో ఒక్కసారిగా ఒంటరయ్యాను.
గమ్యం లేని ప్రయాణంలా వుంది నువులేని జీవితం.
నా మనసు చేసిన మోసంకు నేనే బలయ్యాను.
అనుమానం నా కళ్ళకు పొరలా అడ్డుపడింది.
ఇప్పుడు నాకు పయనం నది మద్యన వుంది.

కొత్త లోకం నాది

                                                     కొత్త లోకం నాది 


చిరుజల్లులా నన్ను తాకింది ఒక శ్వాస.
ఆ క్షణం నుండి అంతా కొత్తగా వుంది.
కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతోంది.
నా కోసం ఎవరో జీవిస్తున్నారనిపిస్తోంది.
ఆ బావమే ప్రేమ?

ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి నయవంచకి అనితెలిసినా ప్రియురాలిని వధులుకోలేక ప్రియుని వేధనే నా ఈ పాట

                                ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి నయవంచకి అనితెలిసినా ప్రియురాలిని వధులుకోలేక ప్రియుని వేధనే నా ఈ పాట 

పల్లవి
ఎవ్వరూ నడవని ధారిన నిలుచున్నా నీ కోసం,
పధ్మవ్యుహమ్ లాంటి నీ మనసును చేధించుట కొరకు,
కారు చీకట్లు కమ్ముకుంటున్న అమావాస్య లాంటిధి నా జీవితం,
వెలుతురు లేని ధీపం వలె నిలిచినధి నా ప్రాణం,
లోకులు కాకులుగా మారిన ఈవేల,
కొత్తగా కునీరాగం నేర్చుకొంటున్న కొఎలమ్మ గొంతు నులిమినట్లుంధీ.....               11ఎవ్వరూ11



చరణం
గుప్పెడంత గుండెలో అగ్నిపర్వతం ధాచుకొన్నానే,
నీప్రేమ మైకంలో అమ్మ పంచిన ప్రేగు తెంచుకొన్నానే,
అంధమైన నా కనుల తెరవెనుక కడలి అంత నీరు ధాచానే,
సుడిగుండంలో చిక్కిన నా మనసుకు విడుధాల కలిగేన,
ఓ ప్రియ నీ చిరునవ్వు వెనుక మోసం తెలియక,
ఎంధుకే మనసా నన్ను చీకటిలోనికి నెట్టి వేస్తున్నావు,
ఓ కాలమా నా విధినే ఉరతాడుగా మార్చి నా కంటాన బిగించవచ్చుగా,
నా జీవితన అలసి సొలసి సాగర తీరాన్ని చేరలేక,
ధిక్కు తోచని స్థితిలో నిలుచున్నాధీ నరకపు ముంగిలిలో అని తెలిసినా,
నా పాధాలు ఎటు మోపాలో తెలియక సిలనై నిలిచున్నా నీ కోసం ప్రియా....                  11ఎవ్వరూ11



చరణం
నువ్వు చెస్థున్నధి మోసం అని తెలిసిన నీపై ప్రేమను కురిపించే నా మనసుకు అర్థం కానంటోంది,
నను తడుపుతున్నధి వర్షపు చినుకులు ఐన అగ్ని చిటూములుగా మార్చవే నా జీవితాన,
కంటిలోణ నీరు ఇంకి రక్తపు బోటువులు నీ పాధాలు తాకుతున్నా కరునించవా,
బండరాతిగా మారిన నీ మనసును చూసి మంచు ముత్యం అనుకొంటినే,
నీ మాటలు విను తేనె బోటువులనుకొన్నానే కానీ పధునైనా కత్తి అని అనుకోలేకపోయానే 
ఐనా నువ్వే నా ప్రాణమని విలపిస్తున్నానే వినవ నాగోడు ప్రియా,
చిరుగాలే నా శ్వాసను ఆపినా,
భూమాతే నువ్వు నాకు భారం అని కసిరినా,
కాలమే నా జీవితాన్ని సపించినా,
నీ గుప్పెడంత హృదయంలో నాకింత చోటు కల్పించవా ప్రియా.......                          11ఎవ్వరూ11

నా చివరి క్షణం

                                                      నా చివరి క్షణం 
నువ్వు నా చిరునవ్వువి,
నువ్వే నా లోకానివి.
నా  ప్రాణం నా నుండి దూరమిందే  కాని,  
నా ఆత్మ నీలోనే చేరింది.
ప్రతిక్షణం నీ జ్ఞాపకాల్లోనే వున్నాను,
నీ కన్నీరు నన్ను బాదిస్తోంది.
నీ నీడలా వున్నాను,
మరి ఎందుకోసం నీ ఆవేదన----------?
 

నాకు మాత్రమే తెలుసు నువ్వు ఏంటి అని

                    నాకు మాత్రమే తెలుసు నువ్వు ఏంటి అని 
ప్రేమలో ఉన్న వారిలో చాలా స్వార్ధం వుంటుంది.
అది ఒక్కోసారి వాళ్ళ మద్య దూరాన్ని పెంచుతుంది.
లేదా అ వ్యక్తి జీవితానికి అర్థం అయినా చెబుతుంది.

కాని ఒకరిపై ఇంకొకరికి వున్నా ప్రేమను మాత్రం అంచనా వేయలేము.

ప్రేమించడం, మరవడం -------?

ప్రేమించడం, మరవడం -------? 

రెండు మనస్సులు ఒక్కసారిగా చేసే చప్పుడే ప్రేమ,
అది నా దరికి చేరినపుడు ఎంత ఆనందించానో నాకే తెలుసు...
కాని నీ ప్రేమలో లోపం కనపడ్దాక నా మనసుకి నేనే మరణ శిక్ష వేసాను.
కాని నీతో గడిపిన ఒక్కో చేదు అనుభవాన్ని మరచిపోఎతప్పుడు
                                అంతకంటే ఎక్కువ నరకం చవిచుశాను....

నువ్వు నాతో లేని క్షణం

                                          నువ్వు నాతో లేని క్షణం

నువ్వు నాతో లేని క్షణం
నువ్వు నాతో గడిపిన ఆ క్షణం,
మన పరిచయం స్నేహం అనుకున్నా.
కాదు, ప్రేమ అని నువ్వు చెప్పిన తరుణం,
నిన్ను నేను విడిచి వెళ్ళిన ఆ క్షణం,
నీ ప్రేమకు అర్థం తెలియలేదు.
అది తెలిసిన సమయం దూరమైంది నీ రూపం,
నువ్వు నాతో లేని ఈ క్షణం తెలిసింది,
నువ్వు లేని జీవితం ఎంత నరకమో ------------
 

నా కన్నీరే నీకు నేస్తమా

                                                 నా కన్నీరే నీకు నేస్తమా 
నా కళ్ళు నీటిలో నీకోసం వూగిసలాడుతోంది,
కంటినుండి జారే ఒక్కో చుక్క నీకోసం వెతుకుతూ,
మెల్లగా నా కనుపాప నుండి జారుతోంది చూడు,
అందులో ఏ ఒక్క నీటి బొట్టు నీ మనసును తాకలేదా,
నిజమైన ప్రేమకు అర్థం ఇది కాదేమో ఒకసారి నీ మనసును అడుగు నాకోసం---------!
 

ఎక్కడ వున్నావు నేస్తం

                                             ఎక్కడ  వున్నావు నేస్తం 

గర్షించే మేఘం కాను నేను,
నిన్ను అలరించే చినుకును.
వెలుగుతో తోడు వచ్చే నీడను కాను,
నీ మనసులో దాగిన గుండె చప్పుడుని,
కాలంతో కరిగిపోయే సమయాన్నికాను,
నీ ప్రేమ కోసం పరుగులు తీసే క్షణాన్ని నేను............

Friday 24 August 2012

నా కనులు

                               నా కనులు
 
 
నా మనసులోని ప్రేమ ఎలా తెలుపను,
మౌనమై నా ఆశకు ప్రానమైనది,
నా కనుపాపలు కౌగిలించుకునే(నిదుర) వేళ,
కలలా మారి నా ముందు నిలబడుతున్నావు,
నిన్ను చేరుకోవాలని వేగురతో(తొందర) కళ్ళుతెరిస్తే,
అది బ్రమ అని తెలిసి ఒక్క క్షణం  నిస్సహాయంగా నిలుచుంటున్న,
అదే నేను కనులు తెరవకపోతే నీ మనసు నా ఎదుటేగా--------------------!
 

ప్రేమ విలువ


                                        ప్రేమ విలువ

 
రెండు మనసుల కలయిక ప్రేమ,
ఇరువురి అలోచనలకు గుర్తు ప్రేమ,
ఒకరికి ఒకరై చిరకాలం తోడుగా నిలిపేదే  ప్రేమ,
గుండె చప్పుడుకు అర్థం చెప్పేదే ప్రేమ,
ప్రేమించడం ఒక వరం అయితే......
ఆ ప్రేమను గెలుపొందడం అంతకు మించిన అదృష్టం..........
                                      

నా నేస్తం నా కన్నీరే


                                       నా నేస్తం నా కన్నీరే  



సంతోషంగా నవ్వుతున్నాను, కాని?
ఎందుకో కళ్ళనుండి నీళ్ళు కారుతోంది.
ఒక్కసారిగా నా పెదవి చిరునవ్వు కోల్పోయింది.
ఆ కన్నీరు తుడవడానికి ఏ చేయి ముందుకు రాలేదు.
అప్పుడు అర్థమయ్యింది
నేను ఇంతసేపు నా జ్ఞాపకాల ఒడిలో నిద్రపోతున్నా అని.
నేను ఒంటరి అని తెలిసి ప్రేమ కోసం ఎదురు చూసే నా కళ్ళు,
కన్నీటి సాగరంలో,  అంతేలేని తీరం కోసం ఎదురుచూస్తోంది.

అలసిపోయాను ప్రేమ ప్రయాణంలో

                                    

అలసిపోయాను ప్రేమ ప్రయాణంలో

 
 
అలసిపోయాను మన ప్రేమ ప్రయాణంలో నేను,
నువ్వు, నేను అనే అహంకారంతో,
మన ఇరువురి మది మధ్యన సాగిన ఈ పోరాటంలో అలిసిపోయాను,
ఇప్పుడే నా మది నుండి చీకటి ఇక్కట్లను తొలగించుకొని,
మన కలయికనే ఓ కలగా నిలిపి,
నా మనసుకు ఓదార్పు సమకూరుస్తున్నాను,
వద్దు,  మళ్లీ నన్ను నరకపు ముంగిలిలోకి తీసుకేల్లకు.....!
ఒంటరిగానే నన్ను వుండనీ-------- ఓ ప్రేమ
 

నేనే అదృష్టవంతురాలిని

  నేనే అదృష్టవంతురాలిని

 నీ నీడ నన్ను తకాకే తెలిసింది అనందం విలువ,
నీ వెచ్చని శ్వాస నాకు తగిలాకే తెలిసింది నాకోసం నువ్వు అని,
కెరటాల సవ్వడిలో విన్న నాకోసం నీ మనసు పడే వేదన,
నీ  ప్రేమ పొందిన నా మనసు నింగిని తాకుతున్నట్లుంది.
ఎన్నడు నా చేయిని వీడకు ప్రియా..............

ప్రేమ, జీవితం, కాలం, కన్నీరు...........?


ప్రేమ, జీవితం, కాలం, కన్నీరు...........? 

ప్రేమ అంటే ఒక తియ్యని భావం
అది పెదవికి అందని మాట
మనసుకి తెలియని కొత్త భావం
ఆ భావం అనుబవిస్తేకాని తెలియదు.
ఆ భావాన్ని నేను పొందాను----!
ఎలాగో తెలుసా-----?
నాకోసం అంటూ జీవించే ఒక మనసు
నా మనసుకు ఆ భావం నేర్పింది.
నా కళ్ళకు స్వప్నంతోపాటు,
మరో జన్మకు సరిపొయ్యే ఆనందాన్ని రుచిచూపించింది.
కాని కాలం నా జీవితానికి, నా కళలకు సంకెళ్ళు వేసి,
నా తల రాతకు బంధువు అయ్యింది.
నా అనుకొన్న మనసుని నా నుండి విడదీసింది.
తియ్యటి జ్ఞాపకాలను క్షణంలో తుడిచేసింది.
కన్నీరు నా జీవితానికి వరంగా ఇచ్చింది.
నా స్వేచ్చకి సంకెళ్ళు వేసి,
కాలం నన్ను తన కౌగిట్లో ఒక కీలు బొమ్మగా మార్చింది.
క్షనంతో పోటీ పడలేను,
అలాగని రాజీ పడలేను.
కాని కొన్ని జీవితాలకు కన్నీరే ముగింపు అని తెలుసుకొన్నాను.......
ఇక జ్ఞాపకాలే నా శ్వాస అయ్యి నా గమ్యానికి దారిలా నిలవాలి..............

కవితకు అర్థం

 
                                                       

కవితకు అర్థం

 
 
 
 
 
 
మనసులోని ఊహలకు
ప్రకృతి అందాలకు
పెదవిచాటు మాటలకు
సంతోషపు క్షణాలకు
కన్నీటి జ్ఞాపకాలకు
కళ్ళ తెరవెనుక బావాలకు
అర్థం కవిత

ఒక్క క్షణం

 ఒక్క క్షణం
              మనసు అంటే ఆలోచనా శక్తి లేకపోవడం అని అర్థమా? నాకంటే ఎక్కువ నా ప్రియురాలి మనసును ఎవ్వరు అర్థం చేసుకోలేరు అని అనుకొన్నా. కాని తన ఆలోచనలు, మనసు తెలిసిన నేనే తనని అర్థం చేసుకోకుండా అసహ్యించుకోవడం ప్రారంబించాను. ఇదరి మద్యనా మౌనం నరకంగా మారింది. కాని నేనే ఆ అమ్మాయికి లోకం అని మరచిపోయాను. తనను ఎన్నోసార్లు  నాతో మాట్లాడాలని ప్రయత్నించింది. నేను తనని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే అక్కడ అహం అడ్డువచ్చింది. కాని తను లేకుండా నేను బ్రతకలేను అని తెలుసుకొన్న నా మనసు తనకోసం పరుగులు తీసింది. తనకోసం వెతుకుతున్న నాకు, శ్మశానం నా ప్రేయసికి  నివాసం అని తెలిసింది.  నేను నా అహంకారంకు ఇచ్చిన విలువ నా ప్రేయసి మనసుకు ఇవ్వలేకపోయాను. ఆ ఒక్క క్షణం నా జీవితాన్నే నాశనం చేసింది. ఆ ఒక్క క్షణం నా కళలకు శ్వాస ఆపేసింది. ఆ ఒక్క క్షణం బ్రతికుండగానే నా మనసును చితిమంటల్లో తోసింది. ఆ ఒక్క క్షణం నా జీవిత ప్రతి క్షణాన్ని నరకం కౌగిట్లో బందీని చేసుకొంది...........
 
గాయపడితేనే వేణువు నుండి రాగాలు పలికేది,  గాయపడితేనే  మనిషికి జీవితం విలువ తెలిసేది.

మనసుకు కలిగే తొలి స్పందన ప్రేమ

మనసుకు కలిగే తొలి స్పందన ప్రేమ    


        నా కళ్ళకు కొత్తగా ఊహలు నేర్పింది. 
        నా మనసుకు తొలి సిగ్గును నేర్పింది.
        నా పెదవికి చిరునవ్వును నేర్పింది.
        నా జీవితానికే ఒక వెలుగులా నిలిచింది. 
        వెచ్చని రావికిరణాల స్పర్శ తన శ్వాసతో తెలిపింది.
        వెన్నెల కౌగిట్లో రేకు విచ్చుకునే పువ్వులా నా చెంతకు చేరింది.
        గాలి తాకిడికి చప్పుడు చేసే సముద్రపు అలలలా నాలో ఆశ రేపింది.
        రేయిని పగలుగా మార్చి నాతో ఎన్నో జాగారాలు చేయించింది.
        ఊహల ప్రపంచానికి నన్ను రాజును చేసింది.
        కొత్త కొత్త అభిరుచులు ఎన్నో నేర్పింది.
        నింగినంటిన ఆనందాన్ని రుచిచూపింది.
        అది నా ప్రేయసి నా మనసుకు కల్పించిన తొలి స్పందన.....