Tuesday 14 August 2012

అధిక లాభాలు
 కార్పో "రేట్ ఆసుపత్రుల
షేర్లకు
గిరాకీ పెరిగింది
రోగులకన్నా
హంతకుల్ని బాగా
పేషెంట్లు గా
చేర్చుకుంటున్నందుకు..

గూండాలు
మురికి మెడకు
పూలు బానిసలై
పదవి దండ కాలేదు
సూదులే వచ్చి
గుచ్చి తెచ్చాయి..



గాంధీల  దేశం

నాటి
గాంధీజీ ది
విదేశీ వస్తు బహిష్కరణ
నేటి
గాంధీలది
విదేశీ వస్తు ఆవిష్కరణ

ప్రజాస్వామ్యం

పబ్లిక్ స్టాప్ లో
ఆపకుండా
చుట్టా లిళ్ళకు వెళ్లి
ఎక్కించుకుంటూ
దూసుకుపోయేది
బస్

No comments:

Post a Comment