Tuesday 14 August 2012

************కవిత్వం***********


 ************కవిత్వం***********
కవి
నూరుతున్న
గోరింటాకు
పెట్టుకోండి మనసుకు!
పండుతుంది బతుకు !


                                ******************* వెలుతురు వెళ్ళు********************
 


కవితలు భూములలో వుంటూ
ప్రపంచం చెట్టును బతికిస్తాయి
ఆలోచన పుయిస్తాయి..
మానవతను పండిస్తాయి 
                                  *********************** కవి కోకిల  ***************************

కమ్మగా
కవితలు పాడుతున్నాను కానీ
సొంత గూడు
కట్టుకోలేకపోయాను
ఎందుకంటే
నేను కవిని, కోకిలను..
                     ***************కవి సారధి**************** 



దుర్మార్గుల మీద
బాణాలు విసిరే
అర్జునుడు -కవి
సంసార రధాన్ని
చక్కగా నడిపించే
శ్రీకృష్ణుడు -కవి భార్య


                                                **********************జ్ఞానులు**********************



ప్రభుత్వాసుపత్రిలో
వైద్యం చేస్తూ
పడిపోయిన డాక్టర్ని
ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు
తోటి డాక్టర్లు 
                                               ***********ఆ "కలి"************ 


అన్నం
గడ్డీ
నేలతల్లి ప్రసాదాలే
ఒకటి
కష్టపడితే వచ్చేది
రెండోది
పడీ పడీ మేసేది
                                                        ****************   మహా టెక్నాలజీ       *******************

మా ప్రాజెక్టులన్నీ
ఆధునిక టెక్నాలజీ వే
ఎలాంటి పేలుళ్ళయినా
తేలికగా తట్టుకోగలవు
కానీ-
నాలుగు చినుకులు పడితే మాత్రం
కుప్పకులిపోతాయి..

 

      

No comments:

Post a Comment