Friday 24 August 2012

ఏమవుతున్నది మన దేశం?


                                           

                             ఏమవుతున్నది మన దేశం?




ఏమవుతున్నది ఏమవుతున్నది 
మన దేశం? భారతదేశం....!

నీతికి నిజానికి
సాక్షాలు ఎవ్వరూ - - - 
మనసుకి మించిన
నేస్తాలు ఎవ్వరూ - - - 

మానవత్వం మరిచింది
ఉక్రోషం ఉప్పొంగుతోంది 
లంచమనే ముసుగులో 
తల్లినే అమ్ముకొంటోంది 

ఏమవుతున్నది ఏమవుతున్నది 
మన దేశం? భారతదేశం....!


తరతరాలు మారినా
తలరాతలు మారేనా 
రాజకీయ రంగమే
దనదాహంతో నిండెనే

మారేనా మన విధిరాతే
మారదులే మన బానిసబ్రతుకే 

ఆడదంటే అమ్మ అని 
అంటారే మనదేశంలో 
ఈ మాటే నిజమంటే
నమ్మలేరు ఎవ్వరూ

ఏమవుతున్నది ఏమవుతున్నది 
మన దేశం? భారతదేశం....!

ఎంతోమంది పుణ్యపలం
మనదేశ స్వాతంత్రం
ఏమి గర్వకారణం
చెప్పుకోదగ్గ ఫలితం 
 
మారదురా మారదురా
ఎన్ని యుగాలు గడచినా 
మార్పు అన్నది లేదురా
సమానమన్నది ఏదిరా 

ఏమవుతున్నది ఏమవుతున్నది 
మన దేశం? భారతదేశం....!

No comments:

Post a Comment