Tuesday 21 August 2012

నా మనసుంది --- ప్లీజ్



                                      నా మనసుంది --- ప్లీజ్


 నా చిరునవ్వుకు బదులివ్వకున్నా
నాతో నీ మొదటి మాట తిట్టుకారాదు సుమా!!!
నే వ్రాసిన లేఖ చదవకపోయినా
నిర్దయగా దానిని చించవద్దు
నా ప్రేమను కాదన్నా
నన్ను ఏనాడూ అసహించుకోవద్దు
నా మదియంత నీ రూపమే
నిజం చెప్పినందుకు నన్ను అపార్థం చేసుకోకు
నీవు నడిచే దారిలో గులాబిని ముట్టుకోకున్న పర్వాలేదు
దానిని మాత్రం నాశనం చేయకు
అందులో నా మనసుంది....ప్లీజ్!!!!!
------------------------------ -------------

No comments:

Post a Comment