Friday 24 August 2012

నా మార్గం


                                             నా మార్గం
చూసే ప్రతి అందం నా సొంతం అనేదే కళ్ళు. నా కళ్ళతో నేను చూసే ప్రతి విషయాన్ని నమ్ముతాను. ఎవరో చెప్పినది నమ్మేకంటే నన్నే అంటిపెట్టుకొని వుండే నాకళ్ళను నమ్మడం నాకు  ఆనందం. ఎందుకంటే మంచి, చెడు, విచక్షణ, ఓర్పు, సహకారం అన్నీ నా కళ్ళు నాకు నేర్పుతుంది. నాకు ఈ ప్రపంచంలో ఎవరి తోడు లేకపోయినా నాకళ్ళే నాకు లోకమై నాకు దారి చూపిస్తుంది. కన్నీటిలో మునిగినా, నాకళ్ళు ఈదులాడుతూ పైకి తేలుతూ నాకు గమ్యాన్ని చూపిస్తుంది. అందుకే నాకళ్ళంటే నాకు ఇష్టం. కాని అనుకోని సంఘటనవల్ల నాకళ్ళు  నాకు దూరం అయింది.
                         ఎంతో బాధపడ్డాను. నరకానికి చేరువ అవ్వడం అంటే అప్పుడు అర్థం అయ్యింది.  నాచుట్టు ఎంతమంది ఉన్నాఎందుకో ఒంటరి అనే బావన నన్ను అల్లుకుపోయింది. అన్నికోల్పోయిన వాడిలా మిగిలిపోయాను. ఆ క్షణం ప్రాణం మీద తీపిని కోల్పోయాను. అదే సమయంలో ఒక చిన్న వార్త నా గుండెకోతని అనిచివేసింది. ఒక మహా వ్యక్తి తను చనిపోయాక తన శరీరంలో ఏ అవయవాలు అయితే ఇతరులకు ఉపయోగపడుతుందో అన్నీ తీసుకొని నన్ను సమాధి చేయండి అని తను చనిపోతు చెప్పిన చివరి మాటలు. అవి మాటలు కావు ఎంతోమందికి జీవిత మార్గాలు. అతని కళ్ళే ఈ రోజు నాకు ఊపిరిపోసింది. వెలుగై నాకు దారిచూపిస్తోంది. ఈ సంఘటన నా జీవితాన్నే మార్చేసింది. నేను అతనిలాగానే మావాళ్లకి చెప్పాను. నా శరీరంతో పాటు నాఅవయవాలు మట్టిలో కలిసిపోకూడదు. నాలాంటి వాళ్ళు ఎంతో మంది చిన్న వయసులోనే జీవితాన్ని పోగొట్టుకొంటున్నారు. కళ్లుపోయో, లేక గుండెజబ్బులతోనో, లేక కిడ్నీ పాడయ్యో ఇంకా ఎన్నో చెప్పాలంటే. నేను మంచిపనికి ముందడుగువేసాను. మరి మీరు నేస్తం....................................................?

No comments:

Post a Comment