Wednesday 15 August 2012

నా హృదిలో నిను చేర్చమని .......


                                    నా హృదిలో నిను చేర్చమని .......



తొలిసారి నాకు నచ్చింది నువ్వేనని ,
చివరి వరకు నీ తోడు నాకు కావాలని ,
నీ ప్రతి అడుగులో నీ నీడగా పయనించాలని ,
నా ఆశవు నువ్వై నను చేరుకోవాలని ,
నీ శ్వాసను  నేనై నీలో కలసి పోవాలని ,
నీకు చెప్పాలనుంది, కాని ....
"మొమాటంతో మనసు నిను అడగలేక
మౌనంతో దేవుణ్ణి కోరుకుంటోంది "
ఇన్నాళ్ళ నుంచి నువ్వు వెతుకుతున్న నీ ప్రాణం నేనేనని ,
నీ కోసమే కోవెలగా మార్చిన నా హృదిలో నిను చేర్చమని .......

No comments:

Post a Comment