Friday 24 August 2012

ఇన్ని రోజుల నా ఏకాంతంలో


 
                                                       ఇన్ని రోజుల నా ఏకాంతంలో


ఇన్ని రోజుల నా ఏకాంతంలో
తెలియలేదు ఇన్ని సంగతులు.
నీ పరిచయమే నాలో ఏదో,
కొత్త ఊసులు నేర్పుతు వుందే. 

ఈ వెన్నెలలో
నా మనసులో
నీ శ్వాసే కెరటంగా మారే.

చిలిపి గాయాలతో 
నా పెదవిపై 
నువ్వు వేసావే చెరగని ముద్రనే.

గాలుల్లో సరిగమలే విన్నా
ఆ గమకాలే హద్దులు దాటి
పరుగులు తీసే నా పరువం వైపే.


చెప్పలేని కలలే కన్నా
నాలో ఎన్నో ఊసులు దాచి 
నిదురే మాయం చేసావే నా మనసుకి.

నా కంటిపాపల కౌగిలి వెనుక,
దాగావే దారి చూపు వెలుగులా.  
నా జీవితమే నీదని అన్నా,
చేరుకోవా ఇక ఎప్పటికి నా వాడిలా. 


No comments:

Post a Comment