Tuesday 21 August 2012

ఎందుకంత ప్రేమ



                            
                                                ఎందుకంత ప్రేమ




తండ్రీ! మేమంటే ఎందుకంత ప్రేమ................
కన్నీటిని తుడిచే చేతిలో నిన్ను చూడమంటావు
నా సుఖదూఖాలు నీవంటూ
చల్లగా చెక్కిళ్ళపై జాలువారుతావు
ప్రేమతో నిన్ను చేరుకోమంటావు
ఇంతలో వైరాగ్యమై నన్ను చేరిపోతావు
సర్వం నీవేనంటావు అంతలోనే
అన్నీ మతాల-గ్రంధాల సారాంసమై ప్రకాసిస్తావు
మా కర్మకు మేమే కారణం అంటూనే 
కర్మ, కర్త క్రియ అంతా నీవేన్నంటావు
అనుక్షణం మమ్మల్ని నడిపిస్తున్న ప్రభు!!!
మేమంటే నీకు ఎందుకంత ప్రేమ..........

No comments:

Post a Comment