Friday 24 August 2012

మా అమ్మ


                                                        మా అమ్మ

తన్మయత్వంతో పరవసించిన నా తల్లి
నన్ను అక్కున చేర్చుకొని 
తన గుండె చప్పుడుని నాకు జోలపాటగా వినిపిస్తుంటే అది ఎంతో ఆనందం.

నా లేత పాదాలు 
అడుగులు వేస్తే కందిపోతుందని
తన యదనే నాకోసం రహదారి చేసింది అమ్మ.


తన పోత్తికడుపునే నాకోసం ఆయువుపీటంగా మార్చి
తొమ్మిది నెలలని సంతోష క్షణాలుగా మార్చి 
నా కోసం ఎదురు చూసింది అమ్మ.

తన బంగారు బిడ్డపై ఎవరి దిష్టికల్లు పడకూడదు అని 
తన కోమలమైన కళ్ళకు దిద్దిన కాటుకని
నా లేత చెక్కిలిపై బొట్టు పెట్టింది అమ్మ.

తన తియ్యటి స్వరంతో 
నా గొంతుకు మాటలు నేర్పి
అమ్మ అన్న పిలుపులో వున్న మాడుర్యాన్ని నాకు తెలిపింది అమ్మ.
 
ప్రేమకు ప్రాణం పోసి 
ఆప్యాయతకు రూపుదిద్ది 
బందానికి అర్థం చెప్పే
మారు పేరు అమ్మ.
 

No comments:

Post a Comment