Friday 24 August 2012

ఒక్క క్షణం

 ఒక్క క్షణం
              మనసు అంటే ఆలోచనా శక్తి లేకపోవడం అని అర్థమా? నాకంటే ఎక్కువ నా ప్రియురాలి మనసును ఎవ్వరు అర్థం చేసుకోలేరు అని అనుకొన్నా. కాని తన ఆలోచనలు, మనసు తెలిసిన నేనే తనని అర్థం చేసుకోకుండా అసహ్యించుకోవడం ప్రారంబించాను. ఇదరి మద్యనా మౌనం నరకంగా మారింది. కాని నేనే ఆ అమ్మాయికి లోకం అని మరచిపోయాను. తనను ఎన్నోసార్లు  నాతో మాట్లాడాలని ప్రయత్నించింది. నేను తనని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే అక్కడ అహం అడ్డువచ్చింది. కాని తను లేకుండా నేను బ్రతకలేను అని తెలుసుకొన్న నా మనసు తనకోసం పరుగులు తీసింది. తనకోసం వెతుకుతున్న నాకు, శ్మశానం నా ప్రేయసికి  నివాసం అని తెలిసింది.  నేను నా అహంకారంకు ఇచ్చిన విలువ నా ప్రేయసి మనసుకు ఇవ్వలేకపోయాను. ఆ ఒక్క క్షణం నా జీవితాన్నే నాశనం చేసింది. ఆ ఒక్క క్షణం నా కళలకు శ్వాస ఆపేసింది. ఆ ఒక్క క్షణం బ్రతికుండగానే నా మనసును చితిమంటల్లో తోసింది. ఆ ఒక్క క్షణం నా జీవిత ప్రతి క్షణాన్ని నరకం కౌగిట్లో బందీని చేసుకొంది...........
 
గాయపడితేనే వేణువు నుండి రాగాలు పలికేది,  గాయపడితేనే  మనిషికి జీవితం విలువ తెలిసేది.

No comments:

Post a Comment