Tuesday 14 August 2012

ఎన్ని జన్మలకైనా .......

ఎన్ని జన్మలకైనా .......

నువ్వు నా మెడలో వేసే మూడుముళ్ళ బంధం కోసం ,

నీతో కలసి నడిచే ఏడడుగుల కోసం ,

ఏకాంతంగా నీ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయే హాయి కోసం ,

నన్ను నిన్ను దగ్గర చేసే వెచ్చని కౌగిలి కోసం ,

నువ్వు ప్రేమతో నాకు ఇచ్చే తీయని ముద్దు కోసం ,

నీ అన్నింటిలో నేనూ సగమై పంచుకునే క్షణం కోసం ,

నీలో నేను కలిసే మధురమైన అనుభూతి కోసం ,

..................    ............  .................

ఆ ఏడు క్షణాల కోసం , ఏడు వసంతాలే కాదు ,

ఎన్ని జన్మలైనా ..... ఇలానే ఎదురుచుస్తూ ఉంటాను .

No comments:

Post a Comment