Tuesday 14 August 2012


వేసవొస్తే
వెంటాడే జ్ఞాపకం
తాతయ్య తినిపించిన
తాటిముంజలు...


కాగితం పడవలో
అక్షరాలు అలా
మా వాకిట్లోకొచ్ఛి
కవిత్వాన్ని మోసుకెళ్ళాయి.


వేసవి తాపం
వోపలేకేమో
పాముల్లాంటి జడల్లో
దాక్కున్నాయి మల్లెలు.


ఆమె గొంతెప్పుడు
పెగలదు
కళ్ళు మాత్రం
భాషిస్తూనే ఉంటాయి..


మాటలోంచి
మాటల్లోకి ప్రయాణం
ఈ చర్చకు
లక్ష్యమే కరువు....


ఇందిరమ్మ రాజ్యం

ఎన్నికల వాగ్దానం

పాత కోనేరు
పాచి పట్టిన నీరు..



శతకోటి
ఆశల్ని మింగేసింది
బోర్డ్ తిప్పేసిన
ఆ బ్యాంకు ...


ఊపిరి,నీడ
ఒక జ్ఞాపకం...
చివరిదాకా వెంటాడే
చిరకాల మిత్రులు..

No comments:

Post a Comment