Tuesday 14 August 2012

కమ్మని కలలా కనిపించే నువ్వు

కమ్మని కలలా కనిపించే నువ్వు
ఎప్పటికి నాకు అవుతావు చిరునవ్వు
నిన్నే ప్రేమించే నా గుండె సవ్వడి
చేరాలంటోంది నీ వెచ్చని ఒడి "
" ఎక్కడిది ఈ వీణానాదం ..?
నన్నే అనుసరిస్తోంది నిరంతరం...
వదలలేను జీవితాంతం
నన్నో మనిషిని చేసిన గుడిగోపురం.."
" ఏమిటంత ఆలోచన...
నన్ను గురించేనా ..
ఎపుడో నీ గుండెలో చేరాను
నీ వాకిలిలో ముగ్గునైపోయాను"
" నిదుర లేస్తే
కనిపించే ఉదయం నువ్వే..
నిదురపోతే
కళ్ళనిండా నువ్వే..
" ఎదురుగా కనిపించేది
ఒట్టి ఆకాశమే...
నా హృదయంలో నిలిచింది
నీ అనంత రూపమే."
" ఎన్ని ఉదయాలు సరిపోతాయి
నీ హృదయం ముందు
ఎంత ప్రపంచం సరితూగుతుంది
నీపై నాకున్న ప్రేమ ముందు

No comments:

Post a Comment