Friday 24 August 2012

అమ్మకాల బొమ్మని

 
                                                  
                                               అమ్మకాల బొమ్మని
 
అమ్మకాల నడుమ నలిగే ప్రాణమున్న రాతి బొమ్మని,
భరించేవాడు వెలకడుతుంటే,
కన్నవాళ్ళు ఆ ధర చెల్లిస్తున్నారు,
ఏమాత్రం ఇది న్యాయం?
నిజానికి, నీతికి వున్న తేడా చెప్పిన పెద్ద వాళ్ళే,
ఇది పాపం అని తెలిసిన నాకు ధర చెల్లిస్తున్నారు.
నన్ను కట్టుకోబోయే వాడు ఇనుప ముక్కలతో చేసిన ముళ్ళతో నా మనసు చంపేస్తున్నాడు,
కట్నం పేరుతో తనను తాను వంచించుకొంటున్నాడు.
ఎక్కడ పుట్టింది ఈ దురాచారం?
ఎందుకు మన దేశానికి పట్టుకొమ్మ అయ్యింది.
ఉన్నవారి దగ్గరనుండి లేనివారు అనే భేదం లేకుండా అందరికి నట్టిల్లయ్యింది.
మన శరీరానికి చిన్న వ్యాధి వస్తేనే బాగుచేయడానికి నానా రకాలుగా  ప్రయత్నిస్తాం------
మరి మనసు మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం.
మరి మనసుకు పట్టిన వ్యాధిని తొలగించలేమ......?
ఇది చాలా మహమ్మారి,
 ఈ వ్యాదికి బలైన వారు ఎదుటి వారి ప్రాణాలు సునాయాసంగా తీయగాలుగుతున్నారు.
భారతీయుడా ఈ మహమ్మారిని మన దేశం నుండి తరిమి కొడదాం.
దయ చేసి సహకరించండి.

No comments:

Post a Comment