Friday 24 August 2012

మా ఆడవారి బ్రతుకు అంటే ఇదా

                                                    
                                       మా ఆడవారి బ్రతుకు అంటే ఇదా

నా కన్నీటి చుక్క నా చెంపను తాడిమాకే తెలిసింది,
నేను ఆడపిల్లను అని.
నా పెదవికి నా కన్నవారే మౌనం నేర్పినపుడు తెలిసింది,
నేను ఆడపిల్లను అని.
నా గుండె లోతులో ఎందుకు పుట్టాను అని అనిపించినపుడు తెలిసింది,
నేను ఆడపిల్లను అని.
అన్ని పనులు నేర్చుకోవాలి అంటూ నా చదువు అపెసినపుడు తెలిసింది,
నేను ఆడపిల్లను అని.
వయసు వచ్చింది అంటూ  ఇంటినే జైలుగా మార్చి నన్నుబందిమ్చినపుడు తెలిసింది,
నేను ఆడపిల్లను అని.
బలివ్వబోయే ముందు జంతువుని అలంకరించినట్లు నన్ను పెళ్లిచూపుల పేరుతో కూర్చో పెట్టినప్పుడు తెలిసింది,
నేను ఆడపిల్లను అని.
అతవారింట్లో సేవల పేరుతో జీతం లేని పనిమనిషిగా నన్ను చూసినపుడు తెలిసింది,
నేను ఆడపిల్లను అని.
ఇంకో ప్రాణానికి నేను జన్మనివ్వబోతున్నాను అని తెలిసినప్పుడు అనిపించింది,
అది ఆడవారికి మాత్రమే కలిగిన అదృష్టం అని.
 దేవతగా ఆడవారిని పుజిస్తారు ,
అమ్మగా ఆడదాన్ని గౌరవిస్తారు,
ఒక తోబుట్టువుగా ఆడదాన్ని ప్రేమిస్తారు,
ఒక గురువుగా ఆడదాన్ని అరాదిస్తారు,
మరి బార్యగా మారిన ఆడదాన్ని ఎందుకు ద్వేషిస్తారు?
ఛీ కొట్టినా, చీదరించుకొన్నా మీ పాదాల చెంతనే చోటు కావాలని కోరుకుంటాం అందుకనా  ?
 

No comments:

Post a Comment