Monday 13 August 2012

*************** స్త్రీ ఏకాక్షరం కాదు***************




                                                     

                                       *************** స్త్రీ ఏకాక్షరం కాదు***************   

                                           



స్త్రీ ఏకాక్షరం కాదు

ఉదయించిన సూర్యబింబం
తూర్పు తరుణి నుదుట సిందూరమై
కొండకోనల నుండి తల్లి పిలుపు వినిపించినట్లు
ఇసుకతిన్నెల నుండి ప్రేమ వెల్లువ ముంచెత్తినట్లు
కంటికిమింటికి కనిపించని దారమంత అనుభంధంలా
మనసుకు మనిషికి మధ్య అల్లినట్లుంది స్త్రీ మనోరంజనం

అనుగ్రహించిన అమ్మ నుండి మొదలై
అవహేళనలకు గురి అవుతూ
ఆవేదనల రెప్పల అంచులపై బరువుగా సొలిపోతూ
అనంత విశ్వంలో అందని ఆలాపనై
అడుగడుగునా వినిపించే అపనిందల చంద్రికై
అయోమయంగా సుషిప్తావస్తలో నడుస్తున్నట్లుంది స్త్రీ జీవితం..

బాల్యం, యవ్వనం, ప్రౌదత్వం, వృద్దాప్యం
నాలుగు ధ్వజ స్తంభాలై కాపలా కాస్తూ
ప్రతి అణువునూ పులకింపజేసే తెలుగు వాకిళ్ళలో
బారులు తీరిన పూలదండల మాలల్లా
దివ్యానుభూతిని అందిస్తున్న ఆకాశంలా
సాలేగుడులో స్వప్న బంతిలా ఉంది స్త్రీ తేజశ్చక్రం..
కమ్మని నిదుర జారిపోయి మేలుకునేలోగా
కళ్ళు తెరిచి కపటాన్ని గుర్తించి మాట్లడెలోగా..!
ఆలోచనలు ఆవిర్భవించి అడుగుతీసి అడుగు వేసేలోగా
పాదరసపు గుళికల్లా జారిపోతున్న ప్రేమాంశలు
నిరాశా మయమై జీవన వలయాన్ని అతిక్రమించేలోగా
కన్న కలల్ని కోల్పోయి కన్నీటికి ప్రతీకగా మారుతోంది స్త్ర్హీ వైశిష్ట్యం..

తల్లిపిలుపులో.. తండ్రి పలుకులో
బిడ్డ నవ్వులో.. ప్రియుని వలపులో
భక్తిలో, రక్తిలో, ఆశలో, ఆశయంలో,
నిరంతర నామస్మరణలా సాగే నాదలహరిలా
అంతర్భాగాన జలధి తరంగాల్లా ఎగసి ఎగసి
సుఖ దుఖాత్మక సర్వస్వాన్ని బిమ్బిస్తోంది స్త్రీ ఔన్నత్యం.

ఇంటికి ఇంతి అయినా
పుట్టింటిలో పుబంతిగా
మేట్టినింటిలో మైనపు వత్తిలా
భాధల్ని ముడిచిన పోట్లమై గుండె అంచుల్ని మేలి తిప్పుతూ
మొగలిరేకుల్ని మొహమాటంగా ధరిస్తూ
నైరాస్యంగా నీతిబిందువుల్ని నేల రాల్చుతూ
ప్లాస్టిక్ పలకరింపులతో సంధించిన ప్రస్నాలా ఉంది స్త్రీ స్వాతంత్రం..

కన్నవారిని, కన్న బిడ్డల్ని అయిదవతనాన్ని ఒడిని నింపుకుని
చేస్తున్న స్త్రీ ప్రయాణం ఒక ఫలాక్రుతం..
అందానికో, ఆరాధనకో, ఆహారానికో, ఆహార్యనికో ఎక్కడికైతేనేమి?
మనోస్పర్శలో మౌన రూపం స్త్రీ శాంతం...

అందుకే
స్త్రీ ఏకాక్షరం కాదు
సకల చరాచర సృష్టికి కరతలామలకం
కదిలే జనప్రవాహానికి సాక్షిభూతం
అగ్నికి ఆహుతి చేసినా...
నెత్తుటితో స్నానం చేయించినా
కోటి కాంతి వత్సరాలలో దొరకని నీ ఉనికికి ప్రతిబింబం...!!

No comments:

Post a Comment