Monday 13 August 2012

******తెలుగు లోకం******


                      
                          
                                           

                            ******తెలుగు లోకం******





తెలియని లాలిని గుర్తుకు తెచ్చేదే తెలుగనుకున్న,
కాదు తియ్యని స్వరాల లోకాలకు
తీసుకెళ్ళేదే తెలుగని తెలుసుకున్న,


నా భావాన్ని తెలుసుకోగల
నన్ను కనని తల్లి యే తెలుగుతల్లి అనుకున్న,
కన్నతల్లి కనుమరుగైనా, నను వీడని
నా నీడయే తెలుగని తెలుసుకున్నా,





సాహిత్య సంస్తృతిని సంస్కార రూపంలో
సంచరించగలిగేదే అచ్చ తెలుగ తనమనుకున్న,
పరవశింపజేసే ప్రకృతి ప్రతి అణువుని చూసాక,
అసలు తెలుగుతనానికి పరిదులే లేవని పసిగట్టా


కనులకు కమ్మని అమృతాన్ని పంచే
కళయే కళామతల్లి యని కలగన్న, కాని...
జనన మరణాల రెప్పపాటుకాలంలో
ప్రతి కళ కళామతల్లులకు జీవం పోస్తుందని నేడే కనుగొంటున్న....


ఈ క్షణం మరలా జన్మిస్తూ తెలుసుకున్నా...

No comments:

Post a Comment