Tuesday 14 August 2012

******************మళ్లీ మళ్లీ పుట్టేద్దాం ...!******************


 ******************మళ్లీ మళ్లీ పుట్టేద్దాం ...!******************



మళ్లీ మళ్లీ పుట్టేద్దాం ...!

ఆకాశం పిడికిట్లో సరికొత్త ఉదయం
అవని అవశేషాల్లో మానవ శరీరం
ప్రకృతి సోయగాల్లో సందిగ్ధవాస్థం
అరచేతి గీతల్లో అదృష్టం పలాయనం

ఎక్కడుంది? నూతనత్వమ్..?
ఆశలోనా..?ఆశయంలోనా..?
ఎక్కడుంది మానవత్వం..?
కీర్తిలోనా..? కాంక్ష్ల్లలోనా..?
ప్రతి సంవత్సరం వచ్చేది నూతనత్వం అయితే
ప్రతి పుట్టుక మానవత్వం అవ్వాలి కదా..?

కొత్త పాతల విషయానికి వస్తే
సూర్యచంద్రులు పాతవే కదా..?
అవును కాదుల సంగతి తీస్తే
విజ్ఞానుల ఆలోచన ఎపుడు కాదనే కదా..?
ఏముందని ఈ మనుషుల మద్య వాదన తప్ప
ఎంతున్నా మిగిలేది అసూయ తప్ప

ఎవరో నమిలి పారేసిన మాట 'హ్యాపీ న్యూ ఇయర్ '
ఎవరో నడిచిన పాదముద్రలపై మన అడుగులు
ఎవరో రెచ్చగోడితేనే మన గొంతులు
వేరెవరో కావాలంటేనే మనమున్నమనే గుర్తులు..!

గడ్డ కట్టిన గుండెలతో జీవితాలు
అనాలోచిత ఆలోచనలతోనే మానవరూపాలు
కదలిపోదాం రండి ! గాలి ఎటు వీస్తే అటువైపుకు..!
చేరిపోదాం రండి ! పచ్చనోటు నీడకు..!
తప్పేముంది..?
అంతరంగాన్ని అమ్మేద్దాం..
కదులుతున్న బొమ్మల్లా బతికుందాం..!
'అమ్మ' అనే జీవి ఉన్నంతవరకు
మళ్లీ మళ్లీ పుట్టేద్దాం...!!

No comments:

Post a Comment