Tuesday 14 August 2012

*************ఇపుడు మనిషి మనిషిలో లేడు*************


              *************ఇపుడు మనిషి మనిషిలో లేడు*************



ఇపుడు మనిషి మనిషిలో లేడు
మస్తిష్కంలో ప్రపంచం లేదు
మనసులో ఆలోచనలు లేవు
ఉన్నదల్లా ఒకటే
ఏ నిముషంలో ప్రాణం పోతుందో అనే ఆలోచన

ఇపుడు కులమతాలు లేవు
ఆశ, ఆశయాలు లేవు
ప్రయత్నం,మానవత్వం లేవు
కనబడుతున్నదల్లా ఒకటే
తుపాకులు మోసుకొచ్చేతీవ్రవాదులతో ఆందోళన.....!

ఇపుడు హృదయాలలో స్పందన లేదు
ఆర్ద్రత అనురాగం లేదు
అనుభూతి, ఆత్మీయత లేదు
ఎదురయ్యేదంతా ఒకటే
జనారణ్యంలో మానవ మృగాల సంవేదన..

గూడు లేదు గుండేలేదు
మసీడులేదు మందిరంలేదు
ఖుదా లేడు భగవాన్ లేడు
వెంటాడుతున్నదంతా ఒకటే...
రక్తం రుచి మరిగిన రక్కసి మూకల తీరని తపన...

ప్రక్రుతిలేదు ప్రాణులులేవు
పలకరింపు లేదు పరామర్శ లేదు
గాలి,నీరు లేదు
మంచి, మమత లేదు
గుర్తుకు వస్తున్నదంతా ఒకటే...
బాంబుల దాడిలో ముక్కలైన మృతదేహాల వాసన..

అయినా ..
ఒకచోట ఉండనే ఉంటుంది..
ఒక పచ్చని పూలచెట్టు
పలచని నవ్వుతోనో.. లేత కిరణం లానో
ఒక ఓదార్పు మెట్టు
ముగిసిపోయిన ప్రాణాలపై రాలే
ఒక కన్నీటి బొట్టు
ఒక సముద్రం.. ఎగసిపడే కెరటం
ఒక అరణ్యం.. నిర్భయంగా తిరుగాడే సింహం..
శిలలోమార్దవం..
గ్రీష్మంలో చల్లదనం
నిడురపుచ్చే హస్తం..
అమ్మ ఒడి లాంటి తీయని జ్ఞాపకం...
 

No comments:

Post a Comment